![]() |
![]() |

సురేఖ వాణి ప్రస్తుతం టాలివుడ్ లో మోస్ట్ ఫేవరెట్ ఆర్టిస్ట్. బ్లాక్ బస్టర్ సినిమాలో కచ్చితంగా హీరోకి ఒక అక్కగానో, వదినగానో ఇలా చెప్పుకుంటూ పోతే సురేఖ లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ప్రస్తుతం సురేఖ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా తన కూతురితో కలిసి ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. తల్లి కూతుళ్లు ఇద్దరు.. అక్క, చెల్లెలు మాదిరిగా ఉండడం వాళ్ళకి ఫాలోయింగ్ మరింత ఎక్కవ అయ్యేలా చేస్తుంది.
సురేఖ చిన్నప్పటి నుండి యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ తో స్కూల్ లో ఉన్నప్పుడే చిన్న చితక షోస్ కి యాంకరింగ్ చేసేదట. దాంతో మొదట్లో కొన్ని కామెడీ షోస్ కి యాంకరింగ్ చేసింది సురేఖ. ఆ తర్వాత సినిమాలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమాలు బాగానే ఉన్నాయి. బొమ్మరిల్లు, భద్ర, రెడీ సినిమాల్లో తన నటనకి మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా మ్యాచ్ ఫిక్సింగ్ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది సురేఖ. ప్రస్తుతం సురేఖ వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సురేఖ వాణి.. ఆ ఫోటోలకి వచ్చిమ నెగెటివ్ కామెంట్లతో వైరల్ గా మారుతూ వార్తల్లో నిలుస్తుంది.
ఇటు ఇన్ స్టాగ్రామ్, అటు ఫేస్ బుక్ ఎటు చూసిన సురేఖ ఫాలోయింగ్ ఎక్కువే.. తను ఒక చిన్న ఫోటో పెట్టిన కామెంట్ల వర్షం కురుస్తుంది. అయితే ఎవరెన్ని కామెంట్లు చేసిన పట్టించుకోని సురేఖ.. తన పని తాను చేసుకుంటుంది. సురేఖ బిగ్ బాస్-7 లోకి వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం బిగ్ బాస్ టీమ్ సురేఖని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కాగా ఇప్పుడు సురేఖ బిగ్ బాస్ లోకి వెళ్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |